చర్లపల్లి, ఏప్రిల్ 15 : నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్, బీఎన్‌రెడ్డినగర్‌లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలను ఆలయ కమిటీ చైర్మన్ ఎన్వీ రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జాన్‌రెడ్డి సన్మానించారు. ఆలయ కమిటీ వైస్ చైర్మన్ జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, ప్రతినిధులు నాగమల్లేశ్వర్రావు, గోవర్ధన్‌రావు, సాంబిరెడ్డి, అంజయ్య, ధర్మారెడ్డి, వేణుగోపాల్చార్యులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డప్పు గిరిబాబు, సారా అనిల్‌కుమార్, మహిళ అధ్యక్షురాలు నవనీత, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, కడియాల బాబు, కర్రె సత్యనారాయణ, వేణుగోపాల్‌రెడ్డి, సబిత, గరిక సుధాకర్, కచ్చర్ల రాజు, లక్ష్మారెడ్డి, బత్తుల శ్రీకాంత్‌యాదవ్ పాల్గొన్నారు.
దశలవారీగా అభివృద్ధి పనులు..
ఉప్పల్ నియోజకవర్గంలోని డివిజన్లలో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మల్లాపూర్ డివిజన్ మర్రిగూడలోని పోచమ్మ ఆలయం వద్ద రూ. 7 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులను జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుడు కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మర్రిగూడ బస్తీలో పర్యటించి స్ధానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జలమండలి డీజీఎం సతీశ్, ఏజీఎం జాన్ షరీఫ్, మేనేజర్ సాయిబాబా, సూపర్వైజర్ భరత్, టీఆర్ఎస్ నాయకులు హమాలీ శ్రీనివాస్, తండా వాసుదేవ్‌గౌడ్, అల్లాడి కృష్ణయాదవ్, ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఎఫ్ఎ లలిత, కౌకుంట్ల అంజిరెడ్డి, అల్లూరి నరేందర్, సైదులు, బాల్‌రెడ్డి, నరేశ్‌గౌడ్, కిశోర్, సంజీవరెడ్డి, రాఘవచారి, నర్సింహ, రఘు, పాల్గొన్నారు.