ముషీరాబాద్, ఏప్రిల్ 15: వేసవిలో క్రీడల శిక్షణ శిబిరాల నిర్వహణకు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల 25 నుంచి మే 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని 16 ఏండ్లలోపు చిన్నారులకు పలు క్రీడల్లో తర్ఫీదునివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో అధికారికంగా శిబిరాలను ప్రారంభించనున్నారు. ఇందు కోసం ఎనిమది మైదానాలను ఎంపిక చేసి అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. గంటసాల గ్రౌండ్, ముషీరాబాద్ క్రీడా మైదా నం, అడిక్‌మెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రాంనగర్ వాలిబాల్ గ్రౌండ్, గాంధీనగర్ స్పోర్ట్స్ కాంప్లె క్స్, చిక్కడపల్లి డైరీ, జవహర్‌నగర్ జిమ్లతోపా టు ఇందిరాపార్కులలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందులో ఒక్కో మైదానంలో ఒక్కో క్రీడకు సం బంధించిన శిక్షణను ఇస్తారు. ముషీరాబాద్ క్రీడా మైదానంలో వాలీబాల్, బీచ్ వాలీబాల్, కరాటే, కవాడిగూడ గంటశాల గ్రౌండ్ (గాంధీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్)లో వాలీబాల్, క్రికెట్, కరాటే, బ్యా డ్మెంటన్, ఇందిరాపార్కులో టెన్నిస్, స్కేటింగ్ విభాగాలలో శిక్షణ ఇస్తారు. అదేవిధంగా అడిక్‌మెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో యోగా, కరాటే, షటిల్, చిక్కడపల్లి డైరీఫాంలో కరాటే వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో ..
జీహెచ్ఎంసీకి చెందిన క్రీడా విభాగం(నిపుణులైన) సిబ్బందితో పిల్లలకు ప్రతి రోజూ ఉదయం. సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉండి 6 నుంచి 16 సంవత్సరాలలోపు పిల్లలకు శిక్షణ ఇస్తారు. శిక్షణ శిబిరాల వద్ద మంచినీరు, క్రీడా పరికరాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు నెలన్నర పాటు సాగనున్న వేసవి శిక్షణ శిబిరాల అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
వేసవి శిక్షణ శిబిరాలను 16 ఏండ్ల లోపు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి. నిర్దేశిత క్రీడా ప్రాంగణాల్లో రుసుం లేకుండా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక చేసిన అన్ని క్రీడా ప్రాంగణాల్లో క్రీడల శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం.
-కె. శ్రీనివాస్‌గౌడ్, స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ సికింద్రాద్