గౌతంనగర్, ఏప్రిల్ 11 : బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన కార్య క్రమాలను 18 సంవత్సరాలలోపు బాల బాలికలు సద్వినియోగం చేసుకోవా లని కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ అన్నారు. సోమవారం గౌతంనగర్ చౌరస్తాలో కార్పొరేటర్ బాల అదాలత్ పోస్టర్ను ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 10గంటలకు మేడ్చల్లోని జిల్లా పరిషత్ మందిరంలో బాలల హక్కులపై సమావేశం ఉందని, బాలబాలికలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదు లను స్వీకరించి విచారణ చేపడు తారని తెలిపారు. 18 సంవత్సరాలలోపు బాల బాలికలు ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగ్యరేఖ, మీనాక్షి, లక్ష్మి, ఈశ్వరి, భాగ్యలక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు.
బాల అదాలత్ పోస్టర్ ఆవిష్కరణ
బాల అదాలత్ పోస్టర్ను సోమవారం నాచారం కార్పొరేటర్ శాంతి ఆవిష్కరించారు. ఈనెల 12న మేడ్చల్లోని జిల్లా పరిషత్ మందిరంలో బాలల హక్కులపై సమావేశం ఉంటుందని.. దీనిలో ఏమైన సమస్యలు ఉంటే బాలబాలికలు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రీతిరెడ్డి, సువర్ణ, సాహిని, లత, తదితరులు పాల్గొన్నారు.