బడంగ్‌పేట, ఏప్రిల్11: నాలాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎస్ఎన్డీపీ నుంచి బాలాపూర్ మండలంలోని ముంపు సమస్యను పరిష్కరించడానికి ప్రభు త్వం రూ.97.5 మంజూరు చేసింది. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో రూ.64 కోట్లతో ఏడు పనులు, మీర్‌పేట కార్పొరేషన్లో రూ.23కోట్లతో రెండు పనులు, జల్పల్లి మున్సిపాలిటీలో రూ.10.5 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నారు. బడంగ్‌పేటలోని శివనారాయణపురంలో నాలా పనులు మొదలు పెట్టారు. మరికొన్ని చోట్ల టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన తప్పిదం మరోసారి జరుగకుండా ఉండేలా వాన కాలం రాకముందే పనులు పూర్తి చేయాలని సీఎంకేసీఆర్,మంత్రులు కేటీఆర్, సబి తా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గత వానకాలం భారీ వర్షాలతో బడంగ్‌పేట, మీర్‌పేట, జల్పల్లి మున్సిపాలిటీల పరిధిలో అనేక కాలనీలు నెలల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాం టి సమస్య పునరావృత్తం కాకుండా ఉండటానికి మంత్రి పి సబితారెడ్డి ఇప్పటికే కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రజాప్రతినిధులు, అధికారు లు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
వానకాలం రాకముందే పనులు పూర్తి చేస్తాం..
నియోజకవర్గ వ్యాప్తంగా నాలా ల అభివృద్ధి పనులు జరుగుతు న్నాయి. గతంలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండానాలాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ.97.5కోట్లు కేటాయించారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వాన కాలంలోపే పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశా లు ఇచ్చాం. పనులను ఎప్పటిప్పుడు అధికారులు పర్యవేక్షించాలి. -మంత్రి సబితాఇంద్రారెడ్డి