అత్తాపూర్, ఏప్రిల్ 11: ప్రభుత్వం మూసీ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కొందరి చర్యల కారణం గా అస్తవ్యస్తంగా మారుతుంది. ఓ వైపు ప్రభుత్వం మూ సీని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పా టు చేయడంతో పాటు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొంత మంది అధికారుల కళ్లు గప్పి మూసీలో వ్యర్థ్ధాలను డంపింగ్ చేస్తూ మూసీ నదిని పూడ్చుతున్నారు. రాత్రి సమయాల్లో నగరంలోని పలు ప్రాంతాల నుంచి నిర్మాణ వ్యర్థాలను, ఇతర సామగ్రిని తీసుకువచ్చి మూసీలో పారబోస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడ లంగర్‌హౌస్ బాపుఘాట్ బ్రిడ్జి నుంచి అత్తాపూర్‌కు వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మూసీనది డంపింగ్‌కు కేంద్రంగా మారింది.
నది పొడవునా ప్రతి రోజు లారీల్లో వ్యర్థాలను తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి సమయాల్లో డంపింగ్ చేస్తున్నారు. మూసీలో పోస్తున్న మటి ్టకారణంగా పక్కన ఉన్న రహదారి కూడా చిన్నదిగా మారుతుంది. మట్టి కుప్పలు రోడ్డుపైకి పోస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. మట్టి కారణం గా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు. అవసరమైతే పోలీసుల సహకారంతో మూసీపై నిఘా ఏర్పాటు చే యాలని సిరిమల్లె, హైదర్‌గూడ, అత్తాపూర్ ప్రా ం తాల ప్రజలు కోరుతున్నారు.