పనులప్రారంభోత్సవంలో మాగంటి గోపీనాథ్
జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, ఏప్రిల్1: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. శుక్రవారం డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా బస్తీలు, కాలనీలలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రహ్మత్‌నగర్‌లో రూ.39 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ మన్సూర్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, ఇలియాస్, విశాల్, శ్రీధర్ పాల్గొన్నారు.
ఎర్రగడ్డలో తాగునీటి
అన్ని డివిజన్లలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించి జూబ్లీహిల్స్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో రూ.12 లక్షలతో ఏర్పాటు చేయనున్న తాగునీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నదన్నారు. డివిజన్లో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్‌బేగం, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, కార్యదర్శి షరీఫ్ఖురేషీ, పార్టీ నేతలు పల్లవియాదవ్, గంట మల్లేష్, రాము, కల్యాణి, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.