ఆలయాల ముస్తాబు
పలు దేవాలయాల్లో ఉగాది వేడుకలు
ధోపత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు
అంబర్‌పే ట, ఏప్రిల్ 1 ఉగాది సందర్భంగా అంబర్‌పేటలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో పండుగ వేడుకలు జరగనున్నాయి.
నల్లకుంట శంకరమఠంలో…
నల్లకుంటలోని శంకరమఠంలో ఉగాదిని పురస్కరించుకొని ఈ నెల 2వ తేదిన సా యంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు శుభకృత్ నామ సంవత్సరం పంచాంగ శ్రవ ణం ఉంటుంది. అంతకు ముందు ఉదయం గణపతి, శారదాంబలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.
శ్రీఅహోబిల మఠంలో…
బాగ్‌అంబర్‌పేట డీడీకాలనీలో గల శ్రీఅహోబిలమఠంలో శుభకృత్ నామ సంవత్సర చైత్ర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం ఉదయం 5.30 నుంచి 9.30 వరకు తిరువంజనం, తిరువారాధన, సాత్తుమురై కార్యక్రమాలు ఉంటాయని మఠం మేనేజర్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పంచాంగ శ్రవణం ఉంటుందని చెప్పారు.
మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ఉదయం అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం ఉంటుందని కమిటీ తెలిపింది.
న్యూరామాలయంలో కూడా ఉగాదిని పురస్కరించుకొని ఉదయం శ్రీ సీతారామాంజనేయ సహిత సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
సాయిబాబా దేవాలయంలో కూడా ఉగాది ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రావణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.