సర్కిళ్లలోశేరిలింగంపల్లి ప్రథమ స్థానం
సంవత్సరానికి వసూళ్లలో రికార్డు
కంటే రూ. 20.65 కోట్లు అధికం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2021-22 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను వసూళ్లలో శేరిలింగంపల్లి సర్కిల్ ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో సర్కిల్-20 అత్యధిక వసూళ్లతో రికార్డు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 188.48 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూళ్లు సాధించి గ్రేటర్లో అత్యధిక వసూళ్లు చేసిన సర్కిల్‌గా నిలిచింది.
గతేడాది కంటే 20 కోట్లు అధికం..
గత సంవత్సరం 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరానికి శేరిలింగంపల్లి అధికారులు రూ. 167.82 కోట్లు వసూళ్లు సాధించారు. ఈ ఆర్థిక సంవత్సరం శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లను రాబట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భాగంగా 1 ఏప్రిల్ 2021 నుంచి 1 ఏప్రిల్ 2022 వరకు మొత్తం రూ.188.48 కోట్ల వసూళ్లు సాధించి గ్రేటర్లో ఉన్న 30 సర్కిళ్ల కంటే ముందంజలో ఉంది. గతేడాది కంటే రూ.20.65 కోట్లు అధికంగా ఇంటి పన్ను వసూళ్లు సాధించడం విశేషం.