దుండిగల్,ఏప్రిల్ 1: సమస్యలను పరిష్క రిస్తామని మేయర్ కొలన్‌నీలాగోపాల్‌రెడ్డి తెలి పారు. శుక్రవారం ప్రగతినగర్‌లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించారు. ప్రధానంగా నిజాంపేట నుంచి బాచుపల్లి వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా పేరుకుపోయిన మట్టికుప్పలను తొలగించాలని, నిజాంపేటలో ఆధునిక హంగులతో నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా 191, ఎన్టీఆర్ నగర్, రాజీవ్‌గృహకల్ప సముదాయంలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలన్నారు. దోమలబెడదను నివారించేందుకు కాలనీలు, బస్తీల్లో ఫాగింగ్ చేయాలని, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ కవర్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రీట్‌లైట్లు పనితీరు,మెయిన్‌రోడ్డులో సెంట్రల్ మీడియన్ లైట్లు ఏర్పాటు వంటి పనులను చేపట్టాలన్నారు. పారిశుధ్యసిబ్బందికి సబ్బులు, నూనెలు,సేఫ్టీ కిట్ల పంపిణీ ఎప్పటికప్పుడు చేపట్టాలని మేయర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వాంకుడోత్ బాలాజీనాయక్ పాల్గొన్నారు.అంతకు ముందు మేయర్ నీలాగోపాల్‌రెడ్డి నిజాంపేటలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి,వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్‌రెడ్డి, జగన్యాదవ్,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.