పీర్జాదిగూడ, ఏప్రిల్ 1: వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి… 19వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేయర్ ప్రారంభించారు. డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ హరిశంకర్‌రెడ్డి, నాయకులు బండి సతీశ్ గౌడ్, చంద్రారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్ పాల్గొన్నారు.
జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో..
జవహర్‌నగర్ : కార్పొరేషన్‌లోని ప్రధాన కూడళిలో 25వ డివిజన్ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగిందని, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేటర్లు వేణు, శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్, యువజన విభాగం అధ్యక్షుడు మేకల భార్గవ్‌రామ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, కృష్ణ, సుబ్రహ్మణ్యం, మాధవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు సాధిక్, భాస్కర్, 25వ డివిజన్ అధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.
మజీద్‌పూర్ గ్రామంలో..
శామీర్‌పేట : మజీద్‌పూర్ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని సర్పంచ్ సరసం మోహన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.