మంత్రి చామకూర మల్లారెడ్డి
కీసర, ఏప్రిల్ 1: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ సభ్యుడు బొట్టు రమేశ్‌యాదవ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి లబ్ధిదారుడికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే సీఎం రిలీఫ్ ఫండ్ చాలామందికి అందుతున్నదని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు మాధురి వెంకటేశ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి గణేశ్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎం.డీ ఆరీఫ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన ఒకరికి..
ఘట్కేసర్, ఏప్రిల్ 1 : మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన కైరున్నీసాబేగం వైద్య సహాయ నమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.40 వేల చెక్కు మంజూరైంది.ఈ చెక్కును ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం. పావనీ జంగయ్య యాదవ్ శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని చైర్పర్సన్ పేర్కొన్నారు. కౌన్సిలర్ నర్సింగ్‌రావు, టీఆర్ఎస్ నాయకుడు హరిశంకర్ పాల్గొన్నారు.
మేడ్చల్ పట్టణానికి చెందిన ఒకరికి..
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 1 : మేడ్చల్ పట్టణ పరిధిలోని 4వ వార్డుకు చెందిన డబిల్పూర్ పరశురాంకు సీఎం సహాయనిధి నుంచి రూ.50వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును శుక్రవారం మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గణేశ్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.