ధాన్యం కొనేవరకు కేంద్రం మెడలు వంచుతాం : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, మార్చి 24: తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని కొనేవరకు కేంద్రం మెడలు వంచుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలోని పోతర్లబాబయ్య ఫంక్షన్హాల్లో నియోజకవర్గం పార్టీ విస్త్రృత స్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణను నిలుపుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను తూడ్చిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.
తెలంగాణలో బీజేపీ మత కలహాలను రేపి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తుందదన్నారు. తెలంగాణలో చేస్తున్న అభివృద్ధిని చూస్తు ఓర్వలేకనే బీజేపీ అభివృద్ధిని అడ్డుకుంటుందని అన్నారు. కేంద్రం ప్రభుత్వం గిరిజనును చిన్న చూపు చూస్తూ వారిని కించపరిచే విదంగా మాట్లాడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్త్రృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, మహేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్, వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, మీర్పేట్ మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేరబాలకిషన్, సహకారబ్యాంక్ చైర్మన్ మంచెపాండుయాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్య, మండల రైతు సమన్వయ సమితి నాయకులు రాఘవేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, కోప్షన్ సభ్యులు ఆదిల్‌అలీ తదితరులు పాల్గొన్నారు. ఆర్కేపురం, తుక్కుగూడ, జల్పల్లి , కందుకూరు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అరవింద్‌కుమార్, జల్లెలక్ష్మయ్య, అలీఫా, మన్నె జయేందర్, సర్పంచులు మోతీలాల్‌నాయక్, సాలీవీరానాయక్, మంత్రి రాజేశ్, స్లీవారెడ్డి, ముక్కెర యాదయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, బండారు లావణ్యలింగం నాయకులు మద్ది కరుణాకర్‌రెడ్డి, కరోళ్లచంద్రయ్య ముదిరాజ్, హనుమగల్ల చంద్రయ్య, మాజీ సర్పంచ్ ఆనందం, శివగంగం దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, మహేశ్వరం, తుక్కుగూడ యూత్ అధ్యక్షులు దయాల శ్రీను, సామ్యూల్‌రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మాభాస్కర్రెడ్డి, దోమశ్రీనివాస్రెడ్డి, సమీర్, నవీన్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తరలిన టీఆర్ఎస్ నాయకులు
మహేశ్వరం మండల కేంద్రంలో నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ దేవేందర్, కాకి దశరథ, చిర్ర సాయిలు, కొలను విజ్ఞేశ్వర్‌రెడ్డి, పాండుగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్‌రెడ్డి, గుయ్యని సామయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, బొక్క దీక్షిత్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వెళ్లారు.
ప్రజా వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతున్న కేంద్రం ..
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసనగా మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, బీరెల్లి వెంకట్‌రెడ్డి, న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, ముప్పిడి లింగస్వామిగౌడ్, కొండ్ర శ్రీనివాస్, కంచర్ల శేఖర్, పబ్బు శ్రీనివాస్‌గౌడ్, జగన్మోహన్రెడ్డి, చిన్నం రమేశ్‌కుర్మ, తదితరులు పాల్గొన్నారు.