సికింద్రాబాద్, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ వంట గ్యాస్ ధరలను ఇబ్బడి, ముబ్బడిగా పెంచడంపై సామాన్య జనం కన్నెర్ర చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. కార్పొరేటర్ల సామల హేమ, కంది శైలజలు రోడ్లపైనే వంటా- వార్పు చేపట్టారు. కంటోన్మెంట్‌లోని తాడ్‌బండ్ క్రాస్ రోడ్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని నినదించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మహేందర్, సుందర్, శేఖర్, రేవతి, లక్ష్మి, సుజాత, అరుణతో పాటు బౌద్ధనగర్ డివిజన్‌కు చెందిన ముఖ్యనేత కంది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
తుకారాంగేట్ వద్ద ప్రధాని దిష్టి బొమ్మ దహనం
అడ్డగుట్ట : పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తుకారాంగేట్ సుభాష్ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నగర గ్రంథాలయం డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, నాయకులు సత్తయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మనోహర్, మహ్మద్, నర్సింగ్, అయోధ్య, దేవయ్య, వడ్లూరి రవి, గోపీ, ప్రమీలా, శారదా, మహేశ్వరి పాల్గొన్నారు.
పేదల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వం
బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నది. పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలి. కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలి. గత ఏడేండ్ల బీజేపీ పాలనలో సామాన్య ప్రజల బతుకు ఆగమైంది. ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. పెంచిన ధరలు తగ్గించే వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలన్నారు.
– మన్నె క్రిషాంక్, చైర్మన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి
మారేడ్‌పల్లి: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడం వల్లన పేద ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని, పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న ఆధ్వర్యంలో గురువారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి, మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి…కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెవరెజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, మాజీ బోర్డు ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, మాజీ బోర్డు సభ్యులు నలిళికిరణ్, పాండుయాదవ్, లోకనాథం. టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, నర్సింహ, సంతోష్, ముప్పిడి మధుకర్, ఉమా శంకర్, సదానంద్‌గౌడ్, పిట్ల నాగేష్ ముదిరాజ్, నర్సింహ ముదిరాజ్, నారాయణ, రాము, లాస్యనందిత, నివేదిత, సరిత పాల్గొన్నారు.