బాలానగర్, మార్చి 24 : వంటగ్యాస్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై అధిక భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనల సెగ తగిలేలా ఆందోళనలు చేపడుతామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి ఆయన ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యుడి ఇబ్బందులు పరిగణలోకి తెలుసుకోకుండా కేంద్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌గౌడ్, సయ్యద్ ఎజాజ్, కర్రె జంగయ్య, కర్రె లావణ్య, మక్కల నర్సింగ్, హరినాథ్, నర్సింగ్‌రావు, యాదగిరి, ఖదీర్, పోచయ్య, మట్టి శ్రీను, లలిత, దుర్గ, సరోజ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫతేనగర్‌లో..
ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ ఫతేనగర్ ఫ్లైఓవర్, తెలంగాణతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై వంట చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో భిక్షపతి, సుదర్శన్‌రెడ్డి, కన్నయ్య, సాగర్, శివశంకర్‌గౌడ్, సాయినాథ్‌గౌడ్, సతీశ్, మహేందర్, రాజు, నాగరాజు, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించాలి
కేపీహెచ్‌బీ కాలనీ : పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదలపై పెనుభారం పడుతున్నదని.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రోడ్డుపై బైఠాయంచి నిరసన తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరీ, జనగాం సురేశ్ రెడ్డి, రాజేశ్, రామారావు, కట్టా నరసింగరావు, హన్మంతరావు, సాయిశ్రీనివాస్, పాతూరి గోపి, పున్నారావు, ప్రతాప్, సుంకర సునీల్, గఫూర్, రాము, రాంధన్ నాయక్, రాజావెంకట్రావ్, మస్తాన్, పెద్దిరాజు, హరిబాబు, రాంబాబునాయుడు, పిడికిటి గోపాల్, ప్రసాద్, వేణుగోపాల్, కచిన్, జీఎల్ఎన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, హేమ, లత, రమాదేవి, వెంకటలక్ష్మి, మణి, పద్మ, లీల, అనూరాధ ఉన్నారు.
ధరలు నియంత్రించడంలో విఫలం..
పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాలాజీనగర్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు అన్నారు. ఆంజనేయనగర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ప్రభాకర్ గౌడ్, వెంకటేశ్ చౌదరి, అనితాశ్రీపాల్, అరుణాశెట్టి, అంజిగౌడ్, జయరాజ్, ఖదీర్, కర్క పెంటయ్య, యాదుల్, సురేశ్ గౌడ్, అనిల్‌కుమార్, సాయిబాబా, రమణ, భాస్కర్, రమేశ్, గోపాల్, దేవి, మంగ, కల్యాణ్, ఫయాజ్, శ్రీకాంత్, కిరణ్, లక్ష్మి, అన్నపూర్ణ, ధనలక్ష్మి, అనిత, సుమ, శారద ఉన్నారు.
మూసాపేటలో ధర్నా
మూసాపేట: మూసాపేట చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో టాటా ఏసీ వాహనానికి తాడు కట్టి లాగుతూ గ్యాస్ బండలతో నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, కర్క పెంటయ్య, జిల్లా గోపాల్, నపారి చంద్రశేఖర్, సత్యం, జగదీశ్, తిరుపతి, ఇనుగంటి రాజు, సుందర్, జెల్ల రాము, ఆశీర్వాదం పాల్గొన్నారు.
అల్లాపూర్‌లో..
అల్లాపూర్: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ సబీహాబేగం టీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్ లింగాల ఐలయ్య, జ్ఞానేశ్వర్, పార్వతమ్మ పాల్గొన్నారు.
కూకట్‌పల్లిలో..
కూకట్పల్లి: కూకట్పల్లి చౌరస్తాలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ టీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నాచేసి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో బొట్టు విష్ణు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యకర్యదర్శి మహేశ్, చైతన్య యాదవ్, నాగరాజు, వెంకటేశ్ తదితరలు పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్ చౌరస్తాలో కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నాచేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.