కుత్బుల్లాపూర్ జోన్ బృందం, మార్చి 24 :కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ప్రధాన చౌరస్తాల్లో సిలిండర్లతో ప్రదర్శనలు చేపడుతూ.. కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. స్కూటర్లను, ఆటోలను తాళ్లతో లాగుతూ కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పలుచోట్ల ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మున్సిపల్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. రోడ్లపై కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి వినూత్న నిర సన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని, రానున్న రోజుల్లో ఆ పార్టీని ఇంటికి పంపే యో చనలో ప్రజలు ఉన్నారన్నారు. పెంచుతున్న ధరలను ఉపసంహ రించుకోవాలని.. లేని పక్షంలో బీజేపీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామ్, మాజీ కౌన్సిలర్ కిషన్‌రావు, పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
డివిజన్ , సాయిబాబా చౌరస్తా వద్ద మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనలో డివిజన్ బస్తీ సంక్షేమ సంఘా ల ప్రతినిధులు, డివిజన్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
డివిజన్లో పార్టీ నేతలు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.
మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ చౌరస్తాలో టీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, భరత్‌కుమార్, సునీత మురళీయాదవ్, ఎంబరి లక్ష్మీ ఆంజనేయులు, సాయియాదవ్, సంధ్య, అర్కల అనంతస్వామి, గోపాల్‌రెడ్డి, ఆనంద్, బౌరంపేట పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, దుండిగల్ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కొల్తూరు మల్లేశ్, కరీమాతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి,హన్మాన్ దేవాలయం, బస్టాప్ వద్ద నిజాంపేట టీఆర్ఎస్ అధ్యక్షుడు వాకలపూడి రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టి.. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు సురేశ్‌రెడ్డి, రాఘవేంద్రరావు, సుజాతతో పాటు కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.