అబిడ్స్/సుల్తాన్‌బజార్, మార్చి 24: పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు, గ్యాస్ సిలిండర్లను ప్రదర్శించి నిరసన తెలిపారు. మహిళలు గ్యాస్ సిలిండర్లను పక్కన పెట్టి కట్టెల పొయ్యిలతో వంట చేసి వినూత్నంగా నిరసనను ప్రదర్శించారు. మరికొందరు ద్విచక్ర వాహనాలకు తాళ్లుకట్టి వాటిని లాక్కుని తీసుకు వెళ్తూ నిరసన చేపట్టారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. మొజాంజాహి మార్కెట్ చౌరస్తాలో గోషామహల్ టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్‌సింగ్ రాథోడ్ నేతృత్వంలో వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్‌సింగ్ రాథోడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పెంచిన ధరలు తగ్గించేంత వరకు ఆందోళన చేపడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్‌గుప్తా, శీలం సరస్వతి, ప్రియాగుప్తా, ఆర్.శంకర్‌లాల్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సునీల్ సాహు తదితరులు పాల్గొన్నారు. బేగంబజార్ ఛత్రి వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిషోర్ వ్యాస్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బేగంబజార్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ పూజావ్యాస్ బిలాల్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడంతో సాధారణ ప్రజానీకం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెంచిన ధరలను దించేంత వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌సింగ్, పూనం శంకర్జీ, నరేందర్ యాదవ్, నసీర్ అహ్మద్, దినేష్‌సింగ్, కోటి శైలేష్ కురుమ, రామన్ యాదవ్, క్రాంతి, ఈశా, సూరి, శివశంకర్ శర్మ, రవీందర్, సాయి, ఫహీం, అమిత్, శోభ, సోనం, శంకరమ్మ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.
తాళ్లు కట్టి వాహనాలను లాగుతూ..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టోలిచౌకి ప్రాంతంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ వహీద్ అహ్మద్ నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు ద్విచక్ర వాహనాలకు తాళ్లుకట్టి లాగుతూ నిరసన తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బేగంబజార్ ఛత్రి చౌరస్తాలో..
బేగంబజార్ ఛత్రి చౌరస్తాలో గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ మహిళలతో కలిసి నిరసన ప్రదర్శనలో బేగంబజార్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పూజా వ్యాస్ బిలాల్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై వంటా వార్పు..
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పిలుపు మేరకు పార్టీ నాయకులు నిరసన తెలిపారు. మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ పురానాపూల్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టి వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధనం ధరలను పెంచుతూనే ఉన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శశిరాజ్సింగ్, సంజయ్‌సింగ్, నరేశ్‌సింగ్, సురేశ్ గౌడ్, విష్ణుమూర్తి, బల్దీప్సింగ్, ఫయీం, శోభ, భాస్కర్, శ్రీనివాస్ యాదవ్, నాగిరెడ్డి, విశాల్ తదితరులు పాల్గొన్నారు.