చార్మినార్, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌లపై ధరలను పెంచి సామాన్యులపై ఆర్థిక భారం మోపడాన్ని నిరసిస్తూ చార్మినార్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు గురువారం చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చార్మినార్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి సలావుద్దీన్లోడి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మధ్య, పేద తరగతి ప్రజల నడ్డి విరిసేలా ధరలు పెంచుకుంటూ పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొఘల్‌పుర డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాధకృష్ణ, కాంటెస్టెడ్ కార్పొరేటర్ సరితాగోపియాదవ్, ఎస్.వి గోపియాదవ్, గోపిగౌడ్, శ్యాంసింగ్, కులకర్ణి టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మెహిదీపట్నంలో…
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసి తమ నిరసనను తెలిపారు. నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం చౌరస్తాలో నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసిన నాయకులు, కార్యకర్తలు కట్టెలపొయ్యి మీద వంటలు చేశారు. గుడిమల్కాపూర్ చౌరస్తాలో కార్వాన్ నియోజకవర్గం ఇన్చార్జి జీవన్‌సింగ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
కార్వాన్లో…
ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనతో దేశ ప్రజలను ఇబ్బందులు పెడుతుందని కార్వాన్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ అన్నారు. కార్వాన్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ శివ్‌బాగ్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, మిత్ర క్రిష్ణతోపాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కావూరి వెంకటేశ్, పట్లూరి రఘు, ముత్యాల భాస్కర్, శ్రీధర్ సాగర్, ఆదిత్య యాదవ్‌లతోపాటు మంగ, పద్మ, సత్యనారాయణ పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్టలో…
కేంద్రం వంట గ్యాస్ ధర పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల ను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి ముప్పీడి సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో లలితాబాగ్ డివిజన్ భయ్యాలాల్‌నగర్ బస్తీలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ యాకుత్‌పురా నియోజకవర్గం ఇన్చార్జీ సామ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజవర్గం పరిధిలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జమ్మిచెట్టు రాజు, గౌలిపురా డివిజన్ అధ్యక్షుడు సీఎం ప్రవీణ్‌కుమార్, బొడ్డు సరిత, సాయిబాబా, తిరుపతి, శివకుమార్, నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.