దుండిగల్/కుత్బుల్లాపూర్, మార్చి 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు బుధవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిసి.. పలు సమస్యలపై వినతిపత్రాలను అంద జేశారు. సమస్యలను స్వీకరించిన ఎమ్మెల్యే.. సంబంధిత అధికారులతో మాట్లాడి ..వారి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుం టామన్నారు.
డివిజన్ వెంకటేశ్వరకాలనీ(ఈస్ట్) వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కాలనీలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, పార్కుల అభివృద్ధిపై ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందించారు.
గ్రేవ్‌యార్డుకు స్థలం కేటాయించాలని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చ్గాగిల్లాపూర్ గ్రామ క్రిస్టియన్ సోదరుల వినతి..డీపోచంపల్లి కాలనీలో భూగర్భడ్రైనేజీ, మిషన్ భగీరథ, సీసీరోడ్లు, వీధిదీపాల సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు..19వ డివిజన్లో హైల్యాండ్హోమ్స్ వద్ద మంజీర పైపులైన్, ఎస్సీ కాలనీ వద్ద కమిటీహాల్, బైరుని చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద మురుగుదొడ్లు, దోభీ ఘాట్, మురుగుదొడ్ల అభివృద్ధికి కృషి చేయాలని కానీవాసుల వినతి..మహాదేవపురం సీ-బ్లాక్‌లో భూగర్భడ్రైనేజీ, మంజీర పైపులైన్, సీసీరోడ్డు వేయాలని వినతి.
రాజీవ్‌గాంధీనగర్ 15వ వార్డులో క్రిస్టియన్ బరియల్గ్రౌండ్ కమిటీ హాల్ ఏర్పాటు, డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలని కో-ఆప్షన్ మెంబర్ వాణి తదితరులు ఎమ్మెల్యేకు వినతి.