మాధవరం కృష్ణారావు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లు
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 23 : కాళేశ్వరం జలాలతో రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చుతున్న సీఎం కేసీఆర్ కారణజన్ముడని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ పంప్‌హౌజ్, మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గం కార్పొరేటర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఎగువ ప్రాంతానికి తీసుకొచ్చి ఉత్తర తెలంగాణలోని వేలాది ఎకరాల భూములకు తాగునీటిని అందించడం గొప్ప విషయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులతో నాలుగు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా వ్యవసాయానికి ఎలాంటి లోటు ఉండదన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును ఏడేండ్ల కాలంలోనే పూర్తి చేయడం గొప్ప విషయమని అద్భుతమైన ప్రాజెక్టును ప్రతిపక్ష నేతలు సందర్శించి కనువిప్పు పొందాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, మాధవరం రంగారావు, తూము శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ నేతలు గోనె శ్రీనివాస్‌రావు, గౌసుద్దీన్, అంబటి శ్రీనివాస్‌రా, కర్క పెంటయ్య, ఎం.కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.