కాచిగూడ,మార్చి 23: అంబర్‌పేట నియోజకవర్గంలో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం కాచిగూడ డివిజన్లోని లింగంపల్లి బాలప్పబాడలో రూ. 8లక్షలతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులను కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేరు మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను ప్రధానంగా వేధిస్తున్న మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రణాళికాబద్ధ్దంగా అంచనాలు రూపొందించి ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. డ్రైనేజీ పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే కాచిగూడ డివిజన్ ప్రజలకు మురుగు సమస్యనుంచి పూర్తిగా మోక్షం లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్‌యాదవ్, మాజీ ప్లోర్‌లీడర్ రాంబాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు భీష్మాదేవ్,సునీల్బిడ్లాన్, ప్రధాన కార్యదర్శి సదానంద్, బస్తీవాసులు బాబు, ప్రతాప్,సతీశ్, రాఘవేందర్, ఓం ప్రకాశ్‌యాదవ్, దాత్రిక్ నాగేందర్బాబ్జి,బి.కృష్టాగౌడ్, విజితారెడ్డి,శ్రీనివాస్‌యాదవ్,ఎల్.రమేశ్, శ్రీకాంత్‌యాదవ్, జలమండలి మేనేజర్ భావన, డీఈ సువర్ణ, ఏఈ సంప త్, సంతోశ్‌కుమార్, రమాదేవి, బబ్లూ, ఆంటోని, సుభాశ్పటేల్, మల్లికార్జున్, అరవింద్ పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధి బాధితురాలికి ఆర్థిక సాయం
గోల్నాక, మార్చి 23:అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌కు చెందిన మాధురి కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా మందులు కూడా కొనిలేని దుస్థితిలో ఉన్న ఆమె సమస్యను తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ ఇటీవలే రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బుధవారం బాధితురాలిని పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ్ముదిరాజ్, నాయకులు పాల్గొన్నారు.