కందుకూరు, మార్చి 23 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మన పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయన్నారు. బుధవారం మండల పరిధిలోని బేగరికంచెలో రూ.2కోట్ల 14లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కందుకూరులో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ప్రాజెక్టు కోసం సేకరించిన 14వేల ఎకరాల్లో 600ఎకరాల్లో రైతులకు ఇండ్ల స్థలాలు, ఫార్మారంగానికి సంబంధించి యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కందుకూరు మరో మణికొండ కాబోతుందని చెప్పారు. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, సర్పంచ్ సరళమ్మ, ఎంపీటీసీ కాకి రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, డైరెక్టర్లు సామ ప్రకాశ్‌రెడ్డి, పొట్టి ఆనంద్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సర్పంచులు గోపాల్‌రెడ్డి, సాయిలు, కాకి ఇందిరమ్మ దశరథ, గొరిగే కళమ్మ రాజు, అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చదనం..
మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్లీనరీ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేసి తాసీల్దార్ జ్యోతిని ఆదేశించారు, కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తుక్కుగూడలో రూ.1కోటి 70 లక్షలతో..
మహేశ్వరం, మార్చి 23: తుక్కుగూడ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.1కోటి 70 లక్షలతో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వైకుంఠధామం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ, పల్లెప్రగతి గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయన్నారు. తాగునీటి అవసరాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, బూడిద తేజస్విని, శ్రీకాంత్‌గౌడ్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్, బోధ యాదగిరిరెడ్డి, జాపాల బావన సుధాకర్, బాకివిలాస్, మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామ్యూల్‌రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మాభాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.