అప్పా చెరువు వద్ద బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మైలార్‌దేవ్‌పల్లి,మార్చి23: చెరువుల అభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు.బుధవారం మైవలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని అప్పా చెరువులో ఎస్న్డీపీ నిధులతో నిర్మిస్తున్న బాక్స్ డ్రైన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.రెండు సంవత్సరాలుగా వర్షాకాలంలో అప్పా చెరువు నిండి బెంగళూర్ ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నది.రూ.8.4 కోట్లతో అప్పా చెరువు నుంచి బెంగళూర్ ప్రధాన రహదారి వరకు 15 అడుగుల వెడల్పుతో 550 మీటర్ల పొడువున బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపడుతున్నారు. వర్షాకాలం వచ్చే వరకు డ్రైన్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని అప్పా చెరువు, పల్లెచెరువులు రెండు ప్రధాన చెరువులు కావడంతో గత సంవత్సరం పల్లె చరువు నుంచి బాక్స్ డ్రైన్ పనులు చేపట్టడంతో అక్కడి వరద సమస్య పరిష్కారమైందన్నారు. అప్పా చెరువులో కూడా వరద నీరు బయటికి వెళ్లడానికి బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెరువును సందర్శించిన వారిలో జీహెచ్ఎంసీ డీఈ కాసిఫ్ ఉస్సేన్ ,ఏఈ ఫైజల్ ఖాజా డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
మణికొండ/శంషాబాద్ రూరల్,మార్చి 23:శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామానికి చెందిన ప్రియాంకకు రూ.25,000, అలీకోల్తండాకు చెందిన శంకర్‌కు రూ.32,000, పాలమాకుల గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌కు రూ.60,000, శ్రీనివాస్‌కు రూ.60,000, కవ్వగూడ గ్రామానికి చెందిన మల్లేశ్ రూ.60,000.అదేవిధంగా నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రామానికి చెందిన ముగ్గురికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్మేకల ప్రవీణ్‌యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్‌లతో కలిసి బుధవారం ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, ముదిరా జ్,సర్పంచ్‌లు సతీశ్‌యాదవ్, రమేశ్,నాయకులు నర్సిం హ, శ్రీనివాస్, నర్సింహ ముదిరాజ్, మురళి, హేమ్లానాయక్ ,రాజునాయక్, బాల్‌రాజ్ పాల్గొన్నారు.