టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం
మౌలిక వసతులతో కార్పొరేషన్లో కొత్త పుంతలు
హర్షం వ్యక్తం చేస్తున్న కార్పొరేషన్ ప్రజలు
జవహర్‌నగర్, మార్చి 23: జవహర్‌నగర్ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధిలో జవహర్‌నగర్ కార్పొరేషన్ దశ దిశ మారుతున్నది. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది. కార్పొరేషన్‌లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీయూఎఫ్ఐడీసీ) నిధులు రూ. 15 కోట్లతో అన్ని డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రతి డివిజన్లోని మట్టి రోడ్లను సీసీగా మారుస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు
టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే సీసీ రోడ్లను నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాం. కార్పొరేషన్‌లోని ప్రతి డివిజన్లో పనులు పూర్తి కావొచ్చాయి. సీసీ రోడ్ల నిర్మాణంతో నగరపాలక సంస్థలోని ప్రజల ఇబ్బందులు తీరాయి.
– కమిషనర్ జ్యోతిరెడ్డి
ఆదర్శ నగర పాలక సంస్థగా జవహర్‌నగర్
నగర పాలక సంస్థను ఆదర్శవంతంగా అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధిలో వేగం పెరిగింది. ఇప్పటికే కార్పొరేషన్లో రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. మంత్రి మల్లారెడ్డి మరో రూ. 30 కోట్లతో కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. పాలకవర్గంతో కలిసి స్థానిక సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. దీంతో మౌలిక సదుపాయాల కల్పనతో నగరపాలకసంస్థ రూపురేఖలు మారిపోయాయి.
–మేయర్ మేకల కావ్య