ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
దుండిగల్, మార్చి 22 : రజకుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం గాజులరామారం సర్వేనంబర్ 79/1లో దోభీఘాట్ కోసం కేటాయించిన ఎకరా స్థలాన్ని మంగళవారం సంబంధిత అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. రజకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేటాయించిన ఎకరా స్థలంలో దోభీఘాట్‌ను అభివృద్ధి చేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు. అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసేలా చర్యలు తీసు కోవాలని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేతివృత్తిదారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే కుత్బుల్లాపూర్ నియో జకవర్గం పరిధిలో రజకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తాసీల్దార్ సంజీవరావు, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఆర్ఐ పరమేశ్, సర్వేయర్ సునీత, డీఈ శిరీష, ఎస్ఓ సంగీత, ఏఈ సంపత్, టీఆర్ఎస్ నాయకులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
బంగారు మైసమ్మకు ప్రత్యేక పూజలు..
సూరారం డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్ బంగారు మైసమ్మ జాతర సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్య క్రమంలో పార్టీ నాయకులు కస్తూరి బాల్‌రాజ్, రషీద్ బేగ్, పురుష శ్రీనివాస్‌యాదవ్, ఫెరోజ్, దొడ్ల శ్రీనివాస్, తారాసింగ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.