మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ
తప్పనిసరిగా ధరించాలి
సికింద్రాబాద్, మార్చి 22: ఇంటి యజమాని సురక్షితంగా ఉంటేనే ఆ కుటుంబం హాయిగా, భరోసాగా ఉంటుంది. యజమాని ప్రమాదంలో మృత్యువాత పడితే కుటుంబం రోడ్డున పడినట్టే. అతడినే నమ్ముకున్న భార్య, పిల్లల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలు కావడం వల్లే 80 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పోలీస్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బైక్‌పై వెళ్ల్లేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగి ప్రమాదాలపై షార్ట్ ఫిలిం ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ బైక్‌పై వెళ్లేటప్పుడు తప్పని సరిగా పోలీసుల నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు గత వారం రోజులుగా టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో హెల్మెట్ల పంపిణీ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే మంగళవారం మడ్‌ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్సూరెన్స్ సమకూర్చిన హెల్మెట్లను ట్రాక్స్ ఎన్జీవో సంస్థ ద్వారా మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, శ్యామ్‌కుమార్, నళినికిరణ్, నేతలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, పెద్దాల నర్సింహ, ముప్పిడి మధుకర్, అజయ్‌యాదవ్, రాజుసింగ్, ప్రవీణ్‌యాదవ్, పరమేశ్‌తో పాటు ట్రాక్స్ ఎన్జీవో సంస్థ ప్రాజెక్ట డైరెక్టర్ అదిశంకర్, రాజేష్, ఉదయ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
వాహనచోదకులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ దగ్గర ఉంచుకోవాలి.. హెల్మెట్ ధరించడంతో రక్షణ లభిస్తుంది. ఈ విషయంపై వాహనదారులు అప్రమత్తతో ఉండాలి. ఇటీవల చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో మరణాలు హెల్మెట్ లేని కారణంగానే సంభవించాయి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి