కందుకూరు, మార్చి 22 : ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట గ్రామానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు మంగళవారం మంత్రితో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్, ఆకులమైలారం, అన్నోజిగూడ. ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, పంజగూడ, గ్రామాలకు మంత్రి కేటీఆర్ రూ.10కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీటీసీ కాకి రాములు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బ్రాహ్మణపల్లి శేఖర్‌గుప్తా, చిర్ర సాయిలు, కాకి నర్సింహ, పలువురు రైతులు, నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి వినతి
పహాడీషరీఫ్, మార్చి 22: జల్పల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీరామకాలనీలోని వైశ్య సంక్షేమ సంఘం సభ్యులు మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలసి కాలనీలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతామని మంత్రి ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, మాజీ ఎంపీటీసీ దూడల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.