మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 22 :ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో రూ.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. టీఎన్జీవోస్ కాలనీలో రూ.14.20లక్షలు, రామ్‌చరణ్ ఆయిల్ మిల్ రూ.27.40లక్షలు, ఫేమస్ చికెన్ సెంటర్ శ్రీరామ్‌నగర్‌లో రూ.13.20లక్షలు, వెంకటేశ్వర కాలనీ ప్రభుత్వ పాఠశాల సమీపంలో రూ.12.20లక్షలతో సీవరేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాలనీల్లో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పని చేస్తున్నామన్నారు. అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జల మండలి జనరల్ మేనేజర్, డీజీఎం అబ్దుల్‌సత్తార్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్, సరికొండ వెంకటేశ్, సంతుగౌడ్, బుచ్చయ్య, నాని, శేఖర్ పాల్గొన్నారు.
ప్రతి కాలనీలో ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలి
భూగర్భంలో నీటి వనరులను పెంచేవిధంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని కాటేదాన్ సెక్షన్ వాటర్ బోర్డు ప్రాంగణంలో నీటి పారుదల, పష్పగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఇంకుడు గుంతను స్థానిక కార్పొరేటర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూగర్భ జలాలు అడుగంటకుండా ప్రతి కాలనీలో, ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర కార్యాలయాల్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టేలా కృషి చేయాలని స్థానికులను కోరారు. జలమండలి జీఎం చంద్రశేఖర్, జలమండలి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు అబ్దుల్ సత్తార్, జలీల్ హుస్సేన్, మేనేజర్లు రాజనర్సింహా రెడ్డి, వినాయక్, పుష్పగిరి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పుష్పలీల, కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
పేదల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మంగళవారం తన నివాసంలో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు సరికొండ వెంకటేశ్, నోముల రాముయాదవ్, యం జాల మహేశ్‌రాజ్, నాని, యంజాల శేఖర్ పాల్గొన్నారు.