నీటివృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
రామంతాపూర్, మార్చి 22 : నీటిని వృథా చేయవద్దని, పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సూచించారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని రామంతాపూర్ ప్రగతినగర్ లో మ్యారి స్వచ్ఛంద సంస్థ , క్రాంతి కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వీధుల్లో తిరుగుతూ జలం, బలం, సుజలం.. సేవ్ వాటర్ లంటూ నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంట్లో నీటిని వృథా చేయకుండా చూడాలని.. ఇంకుడు గుంత లు నిర్మించుకోవాలని… భూగర్భజ లాలను పెంచాలన్నారు. నీటివృథాపై ప్రజలకు మరింత అవగాహన పెం చాలన్నారు. కార్యక్రమంలో జలమండలి జీఎం జాన్ షరీఫ్, డీజీఎం రజనీకాంత్‌రెడ్డి, ఏఈ ఆసిఫ్, క్రాంతి కళాశాల అధ్యాపక బృందం, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, నాయకులు ముస్తాక్, రాజు, తిప్పని సంపత్‌కుమార్, సూరంశంకర్, బాలకుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, బద్దం భాస్కర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, శ్రీకాంత్‌రెడ్డి, సం తోష్రెడ్డి, నందికంటి శివ, కంచర్ల సోమిరెడ్డి, మల్లేశ్, వేముల చిన్నా, సబిత పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
రామంతాపూర్ డివిజన్‌కు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు సోమినాయుడుకు రూ.60 వేలు, లక్ష్మణ్‌కు రూ.29వేల చెక్కులను ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి అందజేశారు.