కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
పీర్జాదిగూడ, మార్చి 22: మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ పరిధిలో గ్రేటర్ కమ్యూనిటీలో ఇంటింటికీ వ్యక్తిగత నల్లా కలెక్షన్లు ఇస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం కార్పొరేషన్ పరిధి… పర్వతాపూర్‌లోని స్పాంజిల్లా కాలనీని (గ్రేటర్ కమ్యూనిటీ) మేయర్ జక్క వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచినీటి నల్లా కలెక్షన్ల విషయం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాలనీలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత నల్లా కనెక్షన్ల పనులు వెంటనే ప్రారంభించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. కాలనీలో అందరూ ఐక్యతగా ఉండి పండుగలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. మేయర్ మాట్లాడుతూ కాలనీలకు మంచినీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్ పరంగా అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరీమహేశ్, జలమండలి అధికారులు జీఎం శ్రీనివాస్‌రెడ్డి, కాలనీ ప్రతినిధులు జగదీశ్వర్‌రెడ్డి, చరణ్, భాస్కర్‌రావు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ..
శామీర్‌పేట : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. అలియాబాద్ గ్రామానికి చెందిన తుమ్మ వెంకటేశ్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా…. రూ.55 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు మహేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
కీసర మండలానికి చెందిన ఒకరికి…
కీసర : మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇస్తారి శంకర్‌కు మంజూరైన రూ.55వేల చెక్కును మంగళవారం మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ, అంకిరెడ్డిపల్లి టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ప్రశాంత్ పాల్గొన్నారు.