మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డిపై మండిపడ్డ కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి
అమీర్‌పేట్, మార్చి 20 : ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు దాసారం బస్తీ గుడిసెలను తొలగించాలని చూస్తున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై వాస్తవ విరుద్ధ ప్రకటనలు చేసిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి మతిభ్రమించిందని కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఎక్కడా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు జరిగిన అక్కడ వాలి, మీ ఇండ్లు ఖాళీ చేస్తే రోడ్డున పడతారంటూ.. బాధ్యతారాహిత్యంగా పేదలను అయోమయానికి గురి చేస్తూ వచ్చిన శశిధర్‌రెడ్డికి అన్ని చోట్ల చేదు అనుభవాలే ఎదురయ్యాయని విమర్శించారు. తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బస్తీలో 15 అడుగుల కంటే ఎత్తుగా డెబ్రిస్, గార్బేజీ గుట్టలుగా పేరుకుపోయిన నేపథ్యంలో ఇక్కడి పరిసరాలను శుభ్రం చేసే పనులకు మంత్రి తలసాని శ్రీకారం చుట్టారన్నారు. బస్తీవాసులు ఆదివారం కార్పొరేటర్‌ను కలిశారు. మంత్రి తలసాని తమను బెదిరింపులకు గురి చేయలేదని శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. తొలగించిన గుడిసెలు తిరిగి అక్కడే ఏర్పాటవుతాయనిగుడిసె వాసులకు కార్పొరేటర్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫాజిల్‌తో పాటు సీనియర్ నాయకులు సంతోష్ సరఫ్, ఖలీల్‌బేగ్, జమీర్బేగ్, షోయెబ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.