మారేడ్పల్లి, మార్చి 20: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 4,5 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో వార్డు పరిధిలోని ఎల్ఐసీ కాలనీలో రూ. 21 లక్షలతో బీటీ రోడ్లు, భాస్కర్రావు గార్డెన్లో రూ.11 లక్షల 66 వేలతో సీసీ రోడ్లు, పిట్టల బస్తీలో రూ.8 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు బోర్డు నుంచి నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా కాలనీ వాసులు, స్థానిక మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే సాయన్న వార్డులో పర్యటించారు. ఐదో వార్డులోని శేషాచల కాలనీలో రూ.8 లక్షల నిధులతో తాగునీటి పైపులైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే జి. సాయన్న నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…బస్తీ, కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలో సీఎం కేసీఆర్ చొరవతో ఉచిత మంటినీటి పథకం అమలు అయిందని, త్వరలో బస్తీ, కాలనీల్లో ప్రజలందరికీ నీరు సరఫరా అవుతుందని తెలిపారు. నాలుగో వార్డులో పలు కాలనీ, బస్తీలో కూడా అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు టీఎన్. శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పిట్లనాగేష్, పనస సంతోష్, శ్రీకాంత్, నాగినేని సరిత, సదానంద్గౌడ్, దేవులపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.