ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
చర్లపల్లి, మార్చి 20 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి కాలనీలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు నిధులు కేటాయించామని, పలు కాలనీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించామని, త్వరలో మిగతా కాలనీల్లో పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కాలనీల్లో డ్రైనేజీ, తాగునీటి సమస్యలతోపాటు రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. భవానీనగర్‌లో, కాలనీల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసేందుకు, వీధిదీపాల నిర్వహణ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొత్త అంజిరెడ్డి, చిరంజీవి, ఉపాధ్యక్షుడు రుక్కయ్య, సంయుక్త కార్యదర్శి పుల్లారావు, టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, పిట్టల నరేశ్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన సంఘం ప్రతినిధులు
ఉప్పల్, మార్చి 20 : చిలుకానగర్‌కు చెందిన స్వామి వివేకానంద యువక్ సంఘ్ ప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని హబ్సిగూడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలుకానగర్‌లో స్థలం పరిశీలిస్తామని, సంఘం అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జయచందర్, ప్రధాన కార్యదర్శి పరమేశ్, వ్యవస్థాపకులు శ్రీకాంత్, చైర్మన్ ఠాకూర్ ఉమేశ్‌సింగ్, సంజయ్, సలహాదారులు ముక్కాల రామకృష్ణ, చిలువేరి సత్యనారాయణ, ప్రసాద్, విశ్వనాథ్, స్వామి, పవన్‌కుమార్, శరత్‌బాబు, మహేశ్ పాల్గొన్నారు.