మల్కాజిగిరి, మార్చి 20 : టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం రాత్రి అల్వాల్ సర్కిల్ పంజాబీ కమ్యూనిటీ హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ యూత్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ కోసం పనిచేస్తున్న యువతకు గుర్తింపు ఉంటుందని, నాయకులు యువతను ప్రోత్సహించాలన్నారు. యువత ఉన్నత చదువులు చదువుతూ పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. విదేశాల్లో చదవడానికి ప్రభుత్వం రూ.20లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషిచేయాలని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. కాలనీలు, బస్తీల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి వివరాలు కార్పొరేటర్లకు అందజేయాలన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరికొందరికి ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, జితేంద్రనాథ్, యూత్ అధ్యక్షుడు అరవింద్ కుమార్, అనిల్‌కిశోర్, సర్కిల్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆనంద్, ఉదయ్, శ్రీనివాస్‌గౌడ్, అశ్విన్, బలవంత్‌రెడ్డి, నాగేశ్వరరావు, పరమేశ్, జ్యోతియాదవ్ తదితరులు పాల్గొన్నారు.