దుండిగల్, మార్చి 20 : మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించుకునేందుకు ప్రత్యేక రెవెన్యూ మేళాను వినియోగించుకోవాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పి.భోగీశ్వర్లు అన్నారు. గండిమైసమ్మలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ మేళాలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కార మేళాలో ఇంటి పన్ను చెల్లింపు సమస్యలు ఏవైనా ఉంటే ఫిర్యాదు చేసిన తక్షణమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇంటి నంబర్లు, ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతోపాటు టాక్స్ హెచ్చు, తగ్గులు, పన్ను చెల్లింపుదారుల పేరు తప్పులను సరిచేయడం, ఇంటి మ్యుటేషన్, సెల్ఫ్ అసెస్మెంట్ సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలో…
బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలో జరిగిన రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కార మేళాలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తుడుం పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్తి పన్ను చెల్లింపులు, అసెస్మెంట్, మ్యుటేషన్, పేర్లల్లో దొర్లిన తప్పొప్పులను రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కార మేళాలో పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వంటి వాటిని చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ సునంద, శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బిల్ కలెక్టర్లు రాజు, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.