మూసాపేట, మార్చి20: పేదలకు నాణ్యమైన వైద్యసేవలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానలు మానవతాదృక్పథంతో ముందుకు రావాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. మూసాపేట డివిజన్ జనతానగర్‌లో శ్రీరామ యూత్, ప్రజా వెల్ఫేర్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో మ్యాక్స్‌విజన్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తూము శ్రావణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం శ్రీరామ యూత్, ప్రజా వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో బోయినిపల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాబురావు, సి.హెచ్. సత్యనారాయణ, కర్క పెంటయ్య, జిల్ల గోపాల్, నపారి చంద్రశేఖర్, కర్క రవీందర్, తుకారాం, విష్ణు, ఈశ్వర్, అసోసియేషన్ ప్రతినిధులు వెంకటస్వామి, చెరుకు సత్యనారాయణ, అరుణ్, నర్సింగ్, రమేశ్, రాములు, సంజయ్, డేవిడ్, శివరాజ్, భానుమతి, సూర్యకళ, హరిత తదితరులు పాల్గొన్నారు.