లబ్ధిదారులకు పట్టాలు అందేలా చొరవ తీసుకోవాలి
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి
అధికారులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమీక్ష
కుత్బుల్లాపూర్,మార్చి19:రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు న్యాయం చేకూరేందుకు మరోసారి తీసుకొచ్చిన జీఓ 58, 59లపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేలా రెవెన్యూశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆదేశించారు. శనివారం పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల నుంచి పేదలు గుడిసెలు వేసుకొని, రేకుల ఇండ్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు వారికి సకాలంలో పట్టాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నా రు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేయని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అలాంటి పథకాలు ప్రజలందరికి చేరువయ్యేలా సహాయశక్తుల్లా పని చేయాలన్నారు. దీనికి తోడు దళిత బంధు లబ్ధిదారులు ఆ నగదుతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలోఆర్డీవో మల్లయ్య, తహసీల్దార్లు భూపాల్, సంజీవరావు, సరిత, డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నియోజకవర్గ ప్రజలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ సాయికృష్ణ కాలనీలో భూగర్భడ్రైనేజీ ఔట్లేట్ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందించారు.తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మెనేజ్మెంట్ అసోషియేషన్(ట్రస్మా) కుత్బుల్లాపూర్ మండల కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేను కలిశారు.మండల అధ్యక్షులు వనజఅశోక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి,ఛాయాదేవి, పవన్, శ్రీకాంత్, రేణు, పరుశురాంగౌడ్, ఉపేందర్, సహాయ కార్యదర్శి సారిక బల్వంత్‌యాదవ్, పద్మ, కామేశ్వరి, రాజు, మోహనలక్ష్మి ఎన్నికయ్యారు.
125 గాజులరామారం డివిజన్ చంద్రగిరినగర్‌లో తాగునీటిపైపులైన్లు, కమ్యూనిటీహల్ను ఏర్పాటు చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిశారు.
గాజులరామారం మహాదేవపురం కాలనీలో సీసీరోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీవాసులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
సుభాష్‌చంద్రబోస్ నగర్ఏకు చెందిన నవయుగ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి రోడ్లు, డ్రైనేజీ లైన్లు వేయాలని కోరారు.
కుత్బుల్లాపూర్ ఎస్ఎల్ఎన్ వెంచర్స్ సంస్థలో పని చేస్తూ ప్రతిభను చాటుకున్న ఉద్యోగులకు యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైర్టెక్టర్ కిరణ్మయి, డైరెక్టర్ జె.రాకేశ్, సుధాకర్‌గౌడ్, సురేందర్, నరేందర్, సాయి, భాస్కర్, శాంతి, సరిత తదితరులు పాల్గొన్నారు.