కలెక్టర్‌తో కలిసి బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మైనంపల్లి
నేరేడ్మెట్, మార్చి 19: ప్రతి ఏడాది వర్షాకాలంలో ఉత్పన్నమవుతున్న వరద ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. శనివారంనేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ నాగిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వరకు రూ.41కోట్లతో చేపట్టిన బాక్స్ డ్రైనేజీ పనులను కలెక్టర్ హరీశ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. గత సంవత్సరం వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఈ సారి వర్షాకాలంలో ప్రజలకు ఆ ఇబ్బందు లు రాకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని అన్నా రు.అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ బాక్స్ డ్రైనేజీ పనులను వర్షాకాలం రాకముందే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ఎప్పకప్పుడు పరిశీలిస్తూ బాక్స్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమానికి జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రాజెక్టు ఎస్సీ ఆనంద్, ఈఈ రాజు, తహసీల్దార్ నాగమణి, డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహే శ్, ఏఈ సృజన, టీపీఎస్ తుల్జాసింగ్, జీఎం సునీల్‌కుమార్, కార్పొరేటర్లు మీనా ఉపేందర్‌రెడ్డి, ప్రేంకుమార్, రాజ్ జితేంద్రనాథ్ , నాయకులు ఉపేందర్‌రెడ్డి, అంజ య్య, జీవగన్, కరంచంద్, సాయికుమార్, మహత్యవర్ధన్, గోకుల్‌కుమార్, సతీష్‌కుమార్, మహేశ్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, గోపీనాథ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
వినాయక్‌నగర్ డివిజన్లో నివాసం ఉంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కార్మికులకు వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి శరీరం కాలింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటా స్థలానికి చేరుకున్న నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి వారి సిబ్బంది కేసు నమోదు చేసుకుని హుటాహుటిన గాందీ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హన్మంతరావు దవాఖానకు వెళ్లి పరామర్శించారు. సంబంధిత డాక్టర్‌తో మాట్లాడి గాయపడ్డ బాధితులు నర్సింహ అన్సారి , కరమాజివ్, కృష్ణన్ వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేంకుమార్, జితేంద్రనాథ్, జీఎన్వీ సతీశ్‌కుమార్, రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.