పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన
సమస్యను ఏకరవు పెట్టిన స్థానికులు
పరిష్కరిస్తామన్న సుభాష్‌రెడ్డి
చర్లపల్లి, మార్చి19: నియోజకవర్గ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్యెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాప్రా డివిజన్ పరిధిలోని డాబా గార్డెన్, తిరుమల శివపురి కాలనీలో డిప్యూటీ కమిషనర్ శంకర్, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు, వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించామని, త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు ప్రాంతాల్లో నాలాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా డాబా గార్డెన్, తిరుమల శివపురి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేం దుకు చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుధ్య పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సీఎం రిలీఫ్ ఫండ్‌లో భాగంగా మంజూరైన చెక్కులను కాప్రా డివిజన్‌కు చెందిన లబ్ధ్దిదారులు భార్గవి, శ్రీకాంత్రెడ్డికు డిప్యూటీ కమిషనర్ శంకర్, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజుతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం కృష్ణ, ఏఈ అభిషేక్, ఏఎంఒహెచ్ డాక్టర్ శ్రీనివాస్, శానిటరీ సూపర్వైజర్నాగరాజు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, గిల్బర్ట్, నియోజకవర్గ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎంకే. బద్రుద్దీన్, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, రాయ్, శ్రీనివాస్, పవన్‌కుమార్, వెంకటేశ్, మహేశ్, మహిళా నాయకురాలు సురేఖ,శ్రీదేవి,సర్కిల్సిబ్బంది ఉన్నారు.
చలివేంద్రం ప్రారంభం
మీర్‌పేట, హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలోని యూనియన్ బ్యాంక్ వద్ద స్థానికుడు ఇమ్రాన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్‌తో కలిసి ఎమ్మెల్యేప్రారంభించారు.
ఎమ్మెల్యేను కలిసిన కాలనీ నూతన కార్యవర్గం
ఉప్పల్, మార్చి 19 : ఉప్పల్ డివిజన్ సాయిబాబాకాలనీ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం ఎమ్మెల్యే నివాసంలోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేశ్, కాలనీవాసులు భిక్షపతి, రమాకాంత్‌రెడ్డి, సుమన్‌శర్మ, సుబ్బారెడ్డి, సత్తిరెడ్డి, నరసింహ, మల్లేశ్, శ్రీకాంత్, నరసింహారెడ్డి, కృష్ణ, సత్యనారాయణ, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి
రామంతాపూర్, మార్చి 19: నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి శనివారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాలలకు రెండు ఎకరాల స్థలం కేటాంచాలన్నారు. బీసీ మైనార్టీ వెల్పేర్ సొసైటీ గురుకుల పాఠశాలలకు మరో రెండు ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. హబ్సిగూడ డివిజన్లో మల్టీ పర్పస్ యునిటీ బల్డింగ్నిర్మాణానికి స్థలం ఇవ్వాలన్నారు. మల్లాపూర్ నెహ్రూనగర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు.చర్లపల్లి జేఎన్యూఆర్ఎం కాలనీలో గృహాలు శిథిలావస్థకు చేరాయని వాటికి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలన్నారు. నియోజకవర్గంలో పలు పాఠశాలల అభివృద్ధికి మైనింగ్ ఫండ్ నిధులు విడుదల చేయాలన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ దేవేందర్‌రెడ్డి,నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వాసుదేవగౌడ్, నర్సింగ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.