పనుల్లో నాణ్యత పాటించండి
కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
మియాపూర్,మార్చి 18 : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులను చేపడుతున్నట్లు విప్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయిచరణ్ కాలనీ నుంచి ఇంద్రా హిల్స్‌కు వెళ్లే దారిలో నాలాపై రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న కల్వర్టు పనులను కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి గాంధీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయా కాలనీలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా దూరాన్ని తగ్గించేందుకు కల్వర్టు నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. పనుల్లో నాణ్యత పాటించి సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కుమార్ పాల్గొన్నారు.
నేడు అవగాహన సదస్సు
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు సదరు స్థలాలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు చందానగర్‌లోని క్రిస్టల్ గార్డెన్స్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదా ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.