రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో నిర్వహణ
సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో ఆన్లైన్- ఆఫ్లైన్లో విద్యార్థులకు సమ్మర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు (సర్టిఫికెట్ కోర్సులు) నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, సెంట్రల్ స్కూల్స్లలో ప్రాథమిక విభాగం (1 నుంచి 5వ తరగతి) వరకు పరీక్షలు పూర్తయ్యాయని వివరించారు.
శిక్షణ.. వివరాలు
చిన్నారుల కోసం డ్రాయింగ్ కోర్సు నిర్వహిస్తున్నారు. జూన్ 15-22 వరకు బుధ, గురువారాల్లో సాయంత్రం 5గంటల నుంచి 6 వరకు నిర్వహించే ఈ శిక్షణకు 8 నుంచి 15 ఏండ్ల చిన్నారులు చేరవచ్చు. ఫీజు రూ.350 చెల్లించాలి.
అన్నమాచార్య కీర్తనలు (డివోషనల్ మ్యూజిక్- ఓకల్) శని, ఆదివారాల్లో మే 15-22 వరకు. సాయంత్రం 5గంటల నుంచి 6 వరకు. వయస్సు 10 ఏండ్లకు మించి ఉండాలి. ఫీజు రూ.1050 చెల్లించాలి.
యోగాసనాలకు సంబంధించి మహిళలు, పురుషులకు ఉదయం, సాయంత్రం పూట ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇస్తున్నారు. పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ కౌన్సెలింగ్ కోర్సు సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈనెల 21 నుంచి 26 వరకు ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి 9.30 వరకు నిర్వహిస్తారు. చెల్లించాల్సిన ఫీజు రూ.250.
మహిళలు ఉదయం బ్యాచ్ (ఆఫ్లైన్, ఆన్లైన్) కాల పరిమితి నాలుగు (సోమవారం నుంచి శనివారం వరకు)వారాలు. ఏప్రిల్ 4 నుంచి 30 వరకు. ఉదయం 6.30 నుంచి 7.45 గంటల వరకు. 16 నుంచి 50 ఏండ్ల వయస్సు వారు అర్హులు. ఫీజు రూ. 1000.
పురుషులు ఉదయం బ్యాచ్ (ఆఫ్లైన్, ఆన్లైన్) కాల పరిమితి నాలుగు (సోమవారం నుంచి శనివారం వరకు) వారాలు. ఏప్రిల్ 4 నుంచి 30 వరకు. ఉదయం 6.30 నుంచి 7.45 గంటల వరకు. 16 నుంచి 50 ఏండ్ల వయస్సు వారు అర్హులు. ఫీజు రూ. 1000.
మైండ్మేనేజ్మెంట్ టెక్నిక్స్ 5 రోజుల కాల పరిమితి. సోమవారం నుంచి శుక్రవారం. ఏప్రిల్ 4 నుంచి 8 వరకు. 18 ఏండ్లకు మించి ఉండాలి. ఫీజు రూ.250.
మరిన్ని వివరాలకు rkmath.org/vihe లో సంప్రదించాలని తెలిపారు. వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కార్యాలయం నంబర్-04027627961లో ఉదయం 8.30 నుంచి 11.30, సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు సంప్రదించాలని కోరారు. వాట్సాప్ నంబర్-91772 32696లో కూడా సంప్రదించవచ్చని సూచించారు.