కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 18 : అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కేపీహెచ్‌బీ కాలనీ సీఐ కిషన్‌కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా మేల్లచెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన బానోత్ నాగరాజు కుమార్తె ఐ శ్వర్య ఐదేండ్లుగా అనారోగ్యంతో బాధ పడుతుంది. సోషల్ మీడియా ద్వారా విషయం వెలుగులోకి రాగా కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన మండవ అనీల్‌కుమార్ చారిటబుల్ ట్రస్ట్, మిత్రుల సహకారంతో రూ.50వేలు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ సీఐ కిషన్‌కుమార్, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌రావు చేతుల మీదుగా బాలిక తండ్రికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ సీఐ వ్యక్తిగతంగా రూ. 8వేలు, పోలీస్ సిబ్బంది కలిసి రూ. 12వేలు జమచేయగా మొత్తం రూ.20 వేలను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న పేదలను మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముం దుకు రావాలని కోరారు.