దుండిగల్, మార్చి 18 : గత ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన ఇద్దరు బాలురకు సంబంధించిన దవాఖాన బిల్లు రూ.2లక్షలను టీఆర్ఎస్ యువనేత కొలన్ అభిషేక్‌రెడ్డి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, రాజీవ్‌గృహకల్పకు చెందిన నవీన్, శ్రీకాంత్ అనే ఇద్దరు బాలలు ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై తీవ్రం గా గాయపడగా..నిజాంపేట రోడ్డులోని ఓ వైద్యశాలలో చేర్పిం చారు. అయితే.. బాలల వైద్యానికి పెద్దమొత్తంలో ఖర్చుకావ డంతో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుల చొ రవతో ప్రభుత్వం రూ.20 లక్షలు ఎల్వోసీ ఇచ్చింది. అదే సమ యంలో నిజాంపేట మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి రూ.9లక్ష ల నగదు, స్థానిక టీఆర్ఎస్ నేతలు రూ.3లక్షలు మొత్తం రూ.32లక్షలను వైద్యఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ క్రమంలో మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి తనయుడు కొలన్ అభిషేక్‌రెడ్డి శుక్రవారం రూ.2లక్షలను తనవంతుగా దవాఖాన ఖర్చుల నిమిత్తం అందజేశారు. కార్యక్రమంలో 12వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మురళి, నిజాంపేట టీఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షులు రాము, నేతలు శ్రీనివాస్, చంద్రమౌళి, యుగంధ ర్, శ్రీకాంత్, రమేశ్, శివ, పాల్గొన్నారు.