ఆస్తి పన్ను వసూలులో వేగం పెంచిన అధికారులు
బండ్లగూడ, మార్చి 18: ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు వేగం పెంచారు. 2021-2022 సంవత్సరానికి ఇంటింటికీ తిరిగి పన్ను వసులు చేస్తున్నారు. ఆయా కాలనీల అసోసియేషన్ల సహకారంతో అధికారులు ఆస్తి పన్ను వసూలు ముమ్మరం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28,144 మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ రూ. 15 కోట్లు ఉన్నది. ఇప్పటి వరకు రూ. 9.60 కోట్లు వసూలు కాగా, ప్రస్తుత సంవత్సరం డిమాండ్‌ను చేరుకోవడానికి అధికారులు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. శని, ఆదివారాల్లో ఆస్తి పన్ను పరిష్కార వేదికలను కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బిల్ కలెక్టర్లకు సహకరించండి
బండ్లగూడ జాగీర్ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు వెంటనే తమ ఆస్తి పన్ను చెల్లించి బీజేఎంసీ అభివృద్ధికి తో డ్పాటును అందించాలి. ఇప్పటి వరకు 58 శాతం మాత్రమే ఆస్తి పన్ను వసూలు అయిందని తెలిపారు. ఆస్తి పన్ను వసూలు కోసం తమ ఇంటి వద్దకు వచ్చే బిల్ కలెక్టర్లకు సహకరించి పన్నును చెల్లించాలి
– వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్