చార్మినార్, మార్చి 18: నగర జూ సందర్శకులను త్వరలో కొత్త పక్షులు పలకరించనున్నాయి. ఇప్పటికే కేరళ నుంచి వచ్చిన రెండు రియా పక్షులు ప్రస్తుతం, క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్నాయి. మరో వారం రోజుల్లో సందర్శకులను పలకరించనున్న ఈ పక్షులు జూకు కొత్తదనాన్ని తీసుకురానున్నాయని అధికారులు తెలిపారు. రియా పక్షుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్ల నిర్మాణం పూర్తి కావొచ్చిందని అధికారులు వెల్లడించారు.