మైలార్‌దేవ్‌పల్లి,మార్చి14: డివిజన్ పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నానని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. సోమవారం టీఎన్జీవోస్ కాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఏడు నెలలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమస్యను హాట్ స్పాట్‌గా గుర్తించి శాశ్వత పరిష్కారానికి నూతన డ్రైనేజీ పైపులైను ఏర్పాటు చేయడానికి పైపులను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ..నాయకులు విజ్ఞప్తి మేరకు అధికారులకు నివేదిక పంపించి నూతన డ్రైనేజీ లైన్‌ను మంజూరు చేయించామని తెలిపారు. డివిజన్లో కొన్ని పాత డ్రైనేజీ పైపులు పాడవటంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ,వాటి స్థానంలో నూతన పైపులైన్ వేసి డ్రైనేజీ సమస్య లేకుండా చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. సమస్య పరిష్కారం అవుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలమండలి సూపర్ వైజర్ వినయ్‌కుమార్ చందు,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.