మల్కాజిగిరి, మార్చి 14: బాక్స్ డ్రైన్తో వరదముంపు సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్‌లోని గారిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వర కు రూ.41కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలాలను కబ్జాచేస్తే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని అన్నారు. నాలాలు కబ్జాచేసి.. ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో వరదనీటి ప్రవాహానికి అడ్డు వచ్చి కాలనీలు ముంచెత్తుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నార ని అన్నారు. స్వార్థపరులు నాలాలను కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపడితే.. వాటిని నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని అన్నారు. ఇప్పటికే నాలాపైన కట్టిన వాటిని తొలగించ డంతో వరద నీటి ప్రవాహం సజావుగా సాగు తుందన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ నాగమణి, డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్, ఏఈ సృజన, టీపీఎస్ తుల్జాసింగ్, జీఎం అనిల్‌కుమార్, కార్పొరేటర్లు మీనాఉపేందర్ రెడ్డి, ప్రేమ్‌కుమార్, రాజ్ జితేంద్రనాథ్, అనిల్‌కిశోర్, అంజయ్య, జీవగన్, కరంచంద్, సాయికుమార్, మహత్య వర్ధన్, గోకుల్‌కుమార్, శ్రీనివాస్, చెన్నారెడ్డి, గుండా నిరంజన్, సతీశ్‌కుమార్, యాదగిరి, గోపినాథ్, మహేశ్ పాల్గొన్నారు.