కవాడిగూడ, మార్చి 13: రక్త దానం ప్రాణ దానమ ని, ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు రక్తం దానం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నా రు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని జాగృతి భవన్లో గ్రేటర్ హైదరాబాద్ జాగృతి అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బేవరేజెస్ సం స్థ మాజీ చైర్మన్ దేవీ ప్రసాదరావు, నగర మాజీ డిప్యూ టీ మేయర్ బాబా ఫసియోద్దిన్, జాగృతి కార్యదర్శి వరలక్ష్మీలతో కలిసి కేక్ కట్‌చేసి పంపిణీ చేశారు. అనంత రం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు జాగృతి నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌లాగే ఎమ్మెల్సీ కవిత సేవా దృక్ప థం కలిగిన వ్యక్తి అని అన్నారు. బతుకమ్మ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన వ్యక్తి కవిత అని అ న్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి సం స్థను ప్రారంభించి ప్రజలను ఎంతో చైతన్యం చేశారని అన్నారు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మందిరాలు, దేవాలయాలతో పేదలకు పలు సేవా కార్యక్రమా లు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రధానంగా రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను రక్షంచగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నేతలు శ్రీ ను, కుమార్, టీఆర్ఎస్ నగర నాయకుడు ముఠా జయసింహ, నాయకులు వల్లాల శ్యామ్ యాద వ్, జునైద్ బాగ్దాది, సాయి చాణక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.