బోడుప్పల్, మార్చి 13: బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం 7వ డివిజన్ పరిధిలోని హుడాలక్ష్మీనగర్ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న బీటీరోడ్డు పనులను కార్పొరేటర్ కాటపల్లి లతారాంచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల పవన్‌రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, కాలనీ అధ్యక్షుడు అమర్లింగారెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. 28వ డివిజన్ సాయి ఎన్క్లేవ్ కాలనీలో రూ.4లక్షల నిధులతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీపనులను ఆదివారం స్థానిక కార్పొరేటర్ చీరాల నర్సింహతో కలిసి ప్రారంభించారు. అంశాల ప్రాధాన్యతను బట్టి అన్ని డివిజన్లతో అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. కార్యక్రమంలో మహిపాల్‌రెడ్డి, శ్రీను, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.