సిటీ బ్యూరో మార్చి 11(నమస్తే తెలంగాణ: అతివల జోలికి వస్తే.. బెండు తీస్తామంటున్నది షీటీమ్స్. కంటికి రెప్పలా ‘ఆమె’ రక్షణ కోసం డేగ కన్నుపెట్టి.. ఆకతాయిల చేష్టలకు చెక్ పెడుతున్నాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 బృందాలు నిరంతరం పనిచేస్తూ..ఆవారగాళ్ల పనిపడుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో షీ టీమ్స్‌కు మొత్తం 256 ఫిర్యాదులు రాగా, సుమారు 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. 41 పెట్టీ కేసులు, 14 క్రిమినల్ కేసులను నమోదు చేసి.. పోకిరీలను జైలుకు పంపారు.
ఈ రెండు నెలల్లో బస్ స్టాప్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మెట్రో రైల్వే స్టేషన్లు, ట్యూటోరియల్స్, కాలేజీల వద్ద షీ టీమ్స్ 975 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించింది. 70 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. మరో 44 పెట్టీ కేసులను నమోదు చేశారు. మరిన్ని ఫిర్యాదులపై 112 మందికి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చి మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని షీ టీమ్స్ హెచ్చరించాయి. పట్టుబడిన వారిలో 53 మంది మైనర్లు, 19-24(52 మంది), 25-35(34), 36-50(5) వయసు గల వారు ఉన్నారు.
ఈ నంబర్లు నమోదు చేసుకోండి..
సైబరాబాద్ వాట్సాప్ నం.9490617444, బాలానగర్ షీ టీమ్స్-9490617349, ఐటీ కారిడార్-9490617352, మాదాపూర్-8333993519, కూకట్పల్లి-9493626811, జగద్గిరిగుట్ట-9493624561, మియాపూర్-9491051421, పేట్‌బషీరాబాద్-7901114137,
రాజేంద్రనగర్-7901114140, శంషాబాద్-9490617354,
చేవేళ్ల-9493625379, షాద్‌నగర్-9493624147, డయల్ 100కు పోకిరీలు వేధిస్తే.. ఫోన్ చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారులు సూచించారు.