మహేశ్వరం జోన్ బృందం, మార్చి 9: సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన వేయడంతో మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. కందుకూరు, బడంగ్‌పేట, మీర్‌పేట, ఆర్కేపురం, సరూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల ఉద్యోగాలకు ప్రకటన చేయడంతో నిరుద్యోగుల ఆశల చిగురించాయంటూ నృత్యాలు చేశారు.
సరూర్‌నగర్‌లో..
రాష్ట్రంలో ఒకేసారి భారీగా 91,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ బుధవారం సరూర్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అనితారెడ్డి, అరవింద్, కొండల్‌రెడ్డి, మహేందర్, ప్రవీణ్, ఎండీ సలీం తదితరులు ఉన్నారు.
మహేశ్వరంలో..
మహేశ్వరం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగ ప్రకటన చేయడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు నిరుద్యోగులతో కలిసి మహేశ్వరం మండల కేంద్రంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజూనాయక్, మాజీ అధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, ఆంధ్యానాయక్, యాదయ్య, నవీన్, ఎంఏ సమీర్, కంది రమేశ్, వీరానాయక్, రవీందర్‌నాయక్, కృష్ణ, పొల్కం బాలయ్య, కడమోని ప్రభాకర్, దిద్దెల అశోక్‌కుమార్, తొంట రవీందర్, మైసయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం డివిజన్లో..
ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ ఆధ్వర్యంలో అష్టలక్ష్మి కమాన్ వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సాజీద్, సిద్దగోని వెంకటేశ్‌గౌడ్, వంగూరి యాదవరెడ్డి, నాగేందర్, రవీందర్‌రెడ్డి, ఊర్మిళారెడ్డి, చామల శైలజారెడ్డి, దేవేందర్, జాహెద్, దీపక్, బాలునాయక్, కృష్ణ, పబ్బు శ్రీనివాస్, దీపు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కల సాకారమవుతున్న వేళ
సీఎం కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడంతో ఎంతో మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించిన అనంతరం ఒక్కో రంగంపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యమ కాలంలో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసం వేలాది ఉద్యోగాలు వేస్తున్నారు. నిజమైన తెలంగాణ కల సాకరమవుతుంది.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
నిరుద్యోగులకు సీఎం వరాల జల్లు కురిపించడం సంతోషించదగ్గ విషయం. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 91,142 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో మాలాంటి నిరుద్యోగులకు ఎంతో మేలు చేసినట్లు అయ్యింది. గత ఉమ్మడి ప్రభుత్వంలో మన ఉద్యోగాలను ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎక్కువగా కొట్టేశారు. కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి మన ఉద్యోగాలను మనకే దక్కే విధంగా చేయడం శుభపరిణామం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.